Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్య అంశాల్లో ఉంచాలి
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం పలు వసతి గృహాల్లో విద్యార్థులకు దారుణం సిద్ధాంతం తొలగింపుపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసనల్లో బీజేపీ ప్రభుత్వం శాస్త్రీయ విద్యాపై దాడి చేస్తుందని, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జాతీయ ఉద్యమంలో హిందూ ముస్లిం ఐక్యతను, గాంధీ హత్య సంబంధించిన పాటలను తొలగించి, దేశంలో విద్యను మూఢత్వాలకు నెట్టి విద్యా కాసాయికరణ చేసే ప్రయత్నంలో భాగంగానే చరిత్రను వక్రీకరించి, రద్దు చేస్తుందని తెలిపారు. డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద తిరోగమన సిద్ధాంతాలను భావజాలాన్ని వ్యాప్తికి మేధావులు, ప్రజాస్వామ్యక వాదులు, శాస్త్రజ్ఞులు, వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. దేశభక్తితో భారతీయులందరూ శాస్త్ర సాంకేతిక రంగాలను కాపాడుకోవాలని శాస్త్ర విద్యా కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.