Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు సంబంధించి గంటసేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దానికి తోడు రబ్బరు బాల్ అంతా సైజులో మండలంలోని అమ్మనబోలు, మాటూరు ,శర్బనాపురం, తూర్పుగూడెం, కొల్లూరు, గొలనుకొండ గ్రామాలలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది వరి చేన్లలో వడ్లు మామిడి తోటలలోని మామిడి కాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వడగండ్ల వాన పడడంతో చేతికి అందిన పంట పాడైపోయిందని రైతులు కన్నీరు మునిరవుతున్నారు. బండల మీద వరి ధాన్యం ఆరబోసి ఒక్క దగ్గరికి చేస్తానన్న సమయంలోనే ఒక్కసారిగా పది నిమిషాలలో వచ్చిన వర్షానికి తోడు వడగండ్లు రావడంతో కళ్ళలో ఒడ్లు తడిసి ముద్దాయి పెద్ద సైజులో రాళ్లు పడడంతో కొయ్యని వరి పంటలో వరి గింజలు రాలిపోయాయి .మామిడికాయలు దెబ్బలు తగిలి చెల్లా చెదిరయ్యాయి. సుమారు 100 ఎకరాల వరి పంట నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. 30 ఎకరాల మామిడి తోటలోని కాయలు వడగండ్లు అధికంగా పడడంతో నేలరాలాయి. దీనితో రైతుల బాధ వర్ణనాధికంగా మారిపోయింది ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఇటీవల కురిసిన భారీ వర్షానికి కలలో ఉండే దాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మంగ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనుగోల కేంద్రాల దగ్గర ధాన్యం పోసి ఉండడంతో టార్భాలిన్లు లేకపోవడం వల్ల వరి ధాన్యం అధికంగా తడిసింది. రెండు మూడు రోజుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు తేమశాతం చూడకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల కష్టాలు తీర్చాలి.