Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలోని జూనియర్, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శులు ముఖ్యమంత్రి కేసీఆర్కిపోస్ట్ కార్డును రాసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని 17 మండలాలలోని 353 గ్రామపంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు,అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులను రెగ్యులర్చేయాలని కోరుతూ సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి సోమవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్యాలయం ముందు ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్కు పోస్టుకార్డులు పంపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కనకరాజు, శ్రీకాంత్ రెడ్డి ,తిరుమల చారి ,శ్రీలత, ,రాహుల్ రెడ్డి ,స్వప్న ,మహేందర్, మల్లేష్ ,ఇందిరా,మిరబాయి, సర్వర్ నాయక్ .రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సర్వీస్ క్రమబద్ధీకరించాలని తుర్కపల్లి మండల పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు .సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం చౌరస్తా లోగల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం పోస్ట్ కార్డుల ద్వారా ముఖ్యమంత్రి కి ఉత్తరాలు పంపించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు దార మహేందర్ ,శ్రీనివాస్ ,సందీప్ రెడ్డి, వెంకటేష్ ,సుప్రజ ,సురేష్ ,లాలయ్య, కొండయ్య ,మహేష్ ,రోజా, బాలరాజు ,సోమేశ్ నాయక్, నాగరాజు, మధు ,ఆంజనేయులు, సాయికుమార్ ,అల్తాఫ్ ,మని ప్రసాద్, స్వరూప ,చంద్రమౌళి, అరుణ్ కుమార్ ,గణేష్ ,జ్యోతి, శిరీష ,సాయిలు పాల్గొన్నారు.