Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని జిల్లా మానిటరింగ్ ఆఫీసర్, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ సీనియర్ ఇన్స్పెక్టర్ చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు.కాంటాలు వేగవంతం చేయాలన్నారు.ధాన్యం కొనుగోలుకేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు.అంతకుముందు పీఏసీఎస్ చైర్మెన్ వెన్నసీతారాంరెడ్డి ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ సంధ్య, కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మణ్, రైతులు రంగినేని మోహన్రావు, శ్రీకాంత్, పవన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.