Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కొటం రాజు
నవతెలంగాణ-భువనగిరి
ప్రపంచ కార్మికదినోత్సవం మేడే సందర్భంగా గ్రామ గ్రామాన కార్మిక ఎర్రజెండాలు ఎగరవేయాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సి ఐ టి యూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పనికోసం 137 సంవత్సరాల క్రితం పోరాడి కార్మికులు సాధించుకున్నారని తెలిపారు. నేడు మోడీ బీజేపీ ప్రభుత్వం నాటి మేడే స్ఫూర్తిని పాతరెస్తూ కార్మికులు 12 గంటలు పని చేయాలని లేబర్ కోడ్ లు తెచ్చిందని విమర్శించారు. నాటి మేడే పోరాట అమరవీరుల స్ఫూర్తి తో గ్రామ గ్రామాన,పట్టణంలోని ప్రతి వార్డ్ లో ఎర్రజెండాలు ఎగరవేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు లేబర్ ఆఫీసుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటీయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, బిసిడబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు గొరిగె సోములు, జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ భాగ్య, రాష్ట్ర కమిటి సభ్యులు కూరెళ్ళ నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షులు చుక్క రామచంద్రం, జిల్లా కోశాధికారి గాదె కృష్ణ జిల్లా నాయకులు తూటి వెంకటేశం,వంగాల మారయ్య,శివ,గునమొని రాములు,నెలికంటి నర్సింహ, బాబు పాల్గొన్నారు.