Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య
నవతెలంగాణ - భువనగిరి
మనువాదాన్ని ప్రతిఘటిద్దామని, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ భవనంలో సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జన జాతర జిల్లా కన్వీనర్ బోలగాని జయరాములు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా కార్పొరేట్ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పాల్గొని ఉద్యమించాలన్నారు. నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష అంటరానితనం పోవాలని అందరూ ఆత్మగౌరవంతో జీవించే, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించాలని అన్నారు. బీఎస్పీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలో బిజెపి ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మూడు వేల ఏళ్ల కింద నాటి మనువాదాన్ని భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టాలని చూస్తుందని విమర్శించారు. మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్న బీజేపీప్రభుత్వానికి అన్ని సామాజిక ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు .కేవీపీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ నాటి సామాజిక విప్లవకారులైన మహాత్మ జ్యోతిరావు పూలే,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానీయుల స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనువాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ఇన్చార్జ్ భాస్కర్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్, గొర్రెల మేకల పెంపక దారుల సంఘం జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అన్నం పట్ల కృష్ణ, సందెల రాజేష్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు, ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి లతీఫ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గొట్టిపాముల బాబురావు,జిఎంపిఎస్ జిల్లా నాయకులు,ఎల్లంల సత్యనారాయణ, బాలయ్య, జిల్లా నాయకులు కోట కిష్టయ్య, జిల్లా నాయకులు కొండ.అశోక్,రంగ కొండల్,ఎరుకల భిక్షపతి పాల్గొన్నారు.