Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చివ్వేంల
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట కార్యదర్శులు శాంతియుత సమ్మె చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బక్కయ్య,మధు,అశోక్,అరవింద్,సంతోష్,రజిని,గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జే పి ఎస్ లు సమ్మెబాట పట్టారు.శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శాంతియుత నిరవధిక సమ్మెలో పాల్గొని తమ వైఖరిని ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షులు నోముల జగదీష్,ఉపాధ్యక్షురాలు ఎనగందుల వెంకటలక్ష్మి,ట్రెజరర్ బరపటి కష్ణ,నజీర్,పులిమామిడి శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్,నవీన్,దుండి రమేష్,శేఖర్,దత్తు, భీమారెడ్డి,జ్యోతి,శ్వేత,చైతన్య,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మోతే : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని జేపీఎస్ మండల అధ్యక్షులు పోలబోయిన సురేష్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వారు సమ్మె దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు నగేష్ సతీష్ రెడ్డి సంపత్ నాగరాజు పూర్ణ చందర్ సింధు కవిత పాల్గొన్నారు.
అర్వపల్లి : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యుల్ చేస్తూ వెంటనే చేస్తూ జీఓ విడుదల చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నల్ల బ్యాడ్జీలను ధరించి శుక్రవారం నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు .నవీన్ రెడ్డి నెహ్రూ నాయక్.రాజశేఖర్ రెడ్డి. మూర్తి జ్యోత. లింగయ్యమహాలక్ష్మి. ఫర్హానా.కావ్య. శ్రీనివాస రాజు లో పాల్గొన్నారు.