Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరుపేక్కిన మిర్యాలగూడ
- భారీ ప్రదర్శన...
- మోడీని దించితేనే దేశానికి భవిష్యత్తు
- ఛాయ్‌వాలా దేశాన్ని అమ్మేస్తున్నాడు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మేడే ఉత్సవాల భాగంగా మిర్యాలగూడలో సోమవారం మేడే ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలో భారీ ప్రదర్శన చేశారు. హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి రాజీ చౌక్ మీదుగా ఎంపీడీవో ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కోలాట బృందాలు, డప్పు వాయిద్యాలు నడుమ వేలాది మంది కార్మికులు కదంతొక్కారు. ఎర్రజెండాలు తోరణాలతో మిర్యాలగూడ ఎరుపెక్కింది. పడగా వాతావరణం లో మే డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న విధానాల దేశానికి భవిష్యత్తు ప్రమాదకరంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లుకు దారా దత్తం చేస్తున్నాడని ఆరోపించారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్నాడని ఆరోపించారు. భారత్ మాతా పేరుతో దేశాన్ని అమ్మేస్తున్నాడని ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలని పిలుపునిచ్చారు. చారు వాళ్ళ దేశాన్ని అమ్మేస్తుంటే ప్రజలు మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. మన్ కి బాత్‌తో 95 శాతం మంది ప్రజలకు మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. దేవుళ్ళ పేరుతో ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. మోడీని గద్దెను దించి దేశ భవిష్యత్తును కాపాడాలని పిలుపునిచ్చారు. ఏదో పేరుతో ప్రజలను మోసగించేందుకు మోడీ చూస్తున్నాడని, మోడీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మే డే స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి రెమిడల పరుశురాములు, శశిధర్‌రెడ్డి, పోలేబోయిన వరలక్ష్మీ, తిరుపతి రామ్మూర్తి ఆయూబ్, వినోద్ నాయక్, వేములపల్లి వైస్ ఎంపీపీ గోవర్ధన, వివిధ సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.