Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
మండలంలోని తుమ్మ పెన్పహాడ్ గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఐకేపీసెంటర్ను మంగళవారం అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలుగుబెల్లి వెంకటరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాలవర్షంతో వరి పంటంతా నేలపాలైందన్నారు.పంట కోసి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే తేమ శాతం లేదని వారాలకొద్ది కొనుగోలు చేయడం లేదన్నారు.వడగండ్ల వానకు పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలివ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కళంచర్ల చంద్రయ్య,పీఓడబ్య్లూ జిల్లా అధ్యక్షులు కంచర్ల నర్సమ్మ,పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండనాగయ్య, పీవైఎల్ మండల అధ్యక్షులు కలంచర్ల శ్రీను, పీవైఎల్ మండల సహాయకార్యదర్శి ప్రతాప్,ఏఐకేఎంఎస్ బాగా రాములు, ఉప్పుల నరేష్, కళంచెర్ల నరేష్, లింగయ్య ,వెంకన్న, సంఘం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.