Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పొతే రైతులు తగిన గుణపాఠం చెప్తారన్నాని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నీటి పాలైన ధాన్యం చూసి రైతులు రోదిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా, ఆలస్యంగా మొదలు పెట్టిన ధాన్యం సేకరణ, బస్తాలు లేకపోవడం, కాంటాలు వేయడానికి సరైన సిబ్బంది లేకపోవడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాన్స్‌పోర్టు సౌకర్యం లేకపోవడం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తిందన్నారు.అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న దున్నపోతు మీద వాన పడ్డట్లు ప్రభుత్వంలో చలనం లేదని తెలిపారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రెండు మూడు లారీలు అదనంగా పంపించి కాంటాలు త్వరగా వేయాలని,మిల్లర్లతో మాట్లాడి మొలకెత్తిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనకపోయినా, రైతులకు నష్టం జరిగినా కాంగ్రెస్ పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్వామినాయుడు, ఎల్క నర్సిరెడ్డి, రవి, ఈదయ్య,రైతులు తదితరులు పాల్గొన్నారు.