Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మేడే స్ఫూర్తితో మతోన్మాదాన్ని తిప్పికొడదాం..దేశాన్ని కా పాడుకుందామని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి సలీం, జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని 47, 42 వార్డు ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అనంతల శంకరయ్య అరుణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు రక్త తరపనం చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాంచి కార్మిక చట్టాలను రద్దుచేసి దుర్మార్గమైన నాలుగు బిల్లు కోడులను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేదని, సమ్మె చేసే హక్కు లేదని అనడం అన్యాయం అన్నారు. నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేస్తు కార్మిక వర్గం పై, మధ్య తరగతి వర్గం పై, పేదలపై ముప్పేట దాడి చేస్తుందన్నారు. మరో ప్రక్క మతాల మధ్య ఘర్షణలు పెట్టీ దేశాన్ని అల్ల కల్లోలం చెయ్యాలని కుట్రలు పన్నుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలను దేశ ప్రజలు మేడే స్ఫూర్తితో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మల్ల మహేష్, సీనియర్ నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు గుండాల నరేష్, శాఖ కార్యదర్శి కారంపూడి రాము, సహాయ కార్యదర్శి మాటూరు సునీత, చిన్నపాక మంజుల మాటూరి నరేందర్, బుజ్జ సైదులు, రాగి రవికుమార్, జి పద్మ, స్వరూప, వనిత, నరసింహారావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.