Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్య్లూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య
నవతెలంగాణ-భువనగిరి
జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద, రాష్ట్ర నాయకులు పుప్పాల మట్టయ్య విమర్శించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు,స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ సమాజానికి నాల్గోస్తంభంగా కొనసాగుతున్న తమకు నిలువ నీడ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.జర్నలిస్టులు అద్దె భవనాల్లో ఉంటూ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబాలను పోషించలేని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు లేదా ఇంటి స్థలం కేటాయిస్తామని చట్టసభ సాక్షిగా ఇచ్చిన హామీని స్థానిక ఎమ్మెల్యేలు నీరుగారుస్తున్నారని విమర్శించారు.జర్నలిస్టుల పట్ల చిత్తశుద్దితో వ్యవహరించాలని సూచించారు.వెంటనే అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం రైల్వేపాసులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బట్టు రామచంద్రయ్య, డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ,సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, టీపీసీసీ సభ్యలు శతంగళపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షులు బిసుకుంట్ల సత్యనారాయణ, వలిగొండ ఎంపీపీ వెంకటేశ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఏశాల అశోక్ ఏఐఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్,సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేశం, రైతు సంఘం నాయకులు మాటూరి బాలరాజు ఉన్నారు.డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పేరబోయిన నర్సింహులు ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్, జిల్లా ఉపాధ్యక్షులు పాక జహంగీర్‌యాదవ్, దాసి శంకర్,జిల్లా కోశాధికారి ఎండీ రఫీ, జిల్లా సహాయ కార్యదర్శి కదిరేణి సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దిగోజు నాగాచారి, జిల్లా కమిటీ సభ్యులు ఎలుగల కుమారస్వామి, ఆరె నర్సింహులు, ఎల్లాంల వెంకటేశ్, మహిళా జర్నలిస్టులు దేవరకొండ లావణ్య, అనూష పాల్గొన్నారు.