Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈనెల 12న చౌటుప్పల పట్టణంలో నిర్వహిస్తున్న రొడ్డ అంజయ్య ప్రథమ వర్థంతి సభలో వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శుక్రవారం చౌటుప్పల పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆసంఘం మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొడ్డ అంజయ్య కష్టజీవుల, కార్మికుల, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల అమలు కోసం జీవితాంతం పనిచేసి అమరుడైనారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో , యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా, జిల్లా అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నిరంతరం భూమిలేని పేదలకు భూమి కావాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెంచాలని అనేక పోరాటాలు నాయకత్వం వహించి కూలి రేట్ల పెంపులో,పేదలకు భూ పంపిణీలో కీలక పాత్ర పోషించిన ప్రజా నాయకుడు అంజయ్య అని కొనియాడారు. 12న పాధిహామీ చట్టం - సవాళ్లు పై జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర కార్యదర్శి నారిఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి హాజరుకానున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి గుంటోజి శ్రీనివాస్ చారి, మండల కార్యదర్శి బొజ్జ బాలయ్య, మండల నాయకులు మానే సాలయ్య, రాపోతు పద్మ, యాట బాలరాజు, కొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.