Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మహిళ ఇక్కత్ చైతన్య హస్తకళకు జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో రుర్బాన్ క్లస్టర్ నిధుల వినియోగంపై సమగ్ర అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. మహిళ ఇక్కత్ చైతన్య హస్తకళా మాక్స్ కోమ్మలగూడం , బీనా రావు క్రియేటివ్ బిఎంఏసిఎస్ సభ్యుల కమిటి మెంబర్, హ్యాండ్లూమ్స్ ఏడి జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో రూల్బన్ క్లస్టర్ మంజూరు చేసిన నిధుల వినియోగం పై సమగ్ర అవగాహన , దిశానిర్దేశం, ప్రణాళిక , నైపుణ్యం, వస్త్ర ఉత్పత్తి, ఇతర మెలుకువలపై వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు అధికారి నాగి రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి దిశ నిర్దేశంచేశారు.ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ , టెక్స్టైల్స్ అధికారి విద్య సాగర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగి రెడ్డి ,మాక్స్ సభ్యులు పాల్గొన్నారు.