Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో రామిశెట్టి బ్రహ్మం 21వ వర్థంతి సందర్భంగా నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి ప్రాంగణాన్ని శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మం భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు మనకు ఆదర్శంగా నిలిచాయన్నారు.బ్రహ్మం ఆశయ సాధన కోసం మనం కృషి చేయాన్నారు. సింగిల్ విండో చైర్మెన్‌గా, నిబద్ధతగల నాయకునిగా పని చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లావుల రాములు, కేవీఎన్,ఎస్వీ ప్రసాద్, జిల్లా నాయకులు కంబాల శ్రీనివాస్ ,పాలకూరి బాబు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,కేవీఎం మూర్తి, మామిడి వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, ఎల్లావుల రమేశ్, గుండా రమేష్,దంతగాని సత్యనారాయణ,ఆర్.శ్రీనివాస్, స్వామి, కృష్ణ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగవరపు పాండు తదితరులు పాల్గొన్నారు.