Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్‌గౌడ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్టరాజు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల్లో బీసీ (ఓబీసీ) కులాలను లెక్కించాలన్నారు.స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్నా బీసీ (ఓబీసీ) కులాలను లెక్కింపు చేపట్టకపోవడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బీసీలపై ఉన్న వివక్షే కారణమన్నారు.బీసీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు లేకపోవడంతో విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 75 ఏండ్ల నుంచి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ పిళ్లై యాదవ్,రాష్ట్ర అధికార ప్రతినిధి కంచుకొమ్ముల వెంకట్,యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాలి సందీప్‌నాయుడు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాస శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కంటి, రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ కేశవరపు నవీన్, బీసీ నాయకులు దొనకొండ నరేష్, సతీష్,తోట లింగరాజు, గోపాల్‌దాస్ నవదీప్,రవి,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.