Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో త్వరలో ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే.తారక రామారావు పర్యటన ఉన్నందున అభివృద్ధి పనులు అన్నింటిని సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి సంబంధిత కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులకు సూచించారు. శనివారం నల్లగొండ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులనుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిగూడ జంక్షన్ నుండి గడియార సెంటర్ వరకు వేసిన రోడ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. హైదరాబాద్ రోడ్లో గల వివిధ దుకాణదారులు ఫుట్ పాతుల మీద ఎలాంటివి ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అశోక్, వెంకన్న, నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ దిలీప్ రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, శ్రీనివాస్, హరితహారం సిబ్బంది, సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.