Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-చౌటుప్పల్
క్రీడలు కార్మికులకు మానసిక ప్రశాంతతోపాటు శరీర దృఢత్వాన్ని అందిస్తాయని, మేడే వారోత్సవాల సందర్భంగా సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తెలిపారు. మేడే వారోత్సవాల సందర్భంగా ఆలిండియా రోడ్డు ట్రాన్స్ పోర్టు వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయు) ఆధ్వర్యంలో శనివారం చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో కార్మికులకు క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లేశం పాల్గొని జెండా ఊపి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 137 సంవత్సరాల క్రితం పోరాడి కార్మికులు 8 గంటల పనిని సాధించారని, నాటి కార్మికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా అమరవీరుల త్యాగాల బాటలో మేడే నిర్వహిస్తున్నామన్నారు. నాడు సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయడం కోసం మోడి ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. కార్మికులు యూనియన్ ఏర్పాటుచేసుకోవడాన్ని, సమ్మె చేయడాన్ని ప్రశ్నార్థకం చేసిందని మోడి ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మోడి ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. కార్మికులు మేడే పోరాట స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించడం కోసం ఈ నెల 7న భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద జరిగే బహిరంగసభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కబడ్డీలో ప్రథమ బహుమతి ఎం.నర్సింహా, ద్వితయ బహుమతి శ్రీనివాస్‌రెడ్డి టీమ్‌లు గెలుపొందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఆర్టీడబ్ల్యుఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దేవయ్య, గ్రామ కార్యదర్శి మీసాల రవి, ఎమ్‌డి.జావెద్‌ఖాన్, మహేశ్, శ్రీధర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, లింగస్వామి, సంజీవ, రమేశ్, కిష్టయ్య, బిక్షం పాల్గొన్నారు.
కార్మిక గర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి
భూదాన్‌పోచంపల్లి: మే డే వారోత్సవ లను పురస్కరించుకొని ఈ నెల 7న జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కార్మిక గర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. శనివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలో కరపత్రాలను విడుదల చేసి ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పొడిగిస్తూ కార్మికులకు నష్టం చేసే అనేక ప్రతిపాదనలతో నాలుగు లేపరుకోడులనుతీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మంచాల మధు , నాయకులు లక్ష్మయ్య, కృష్ణ ,చెన్నయ్య ,లింగం, శ్రీను, నరసింహ ,యాదయ్య దర్శన్ లింగస్వామి మల్లయ్య, లచ్చయ్య, నరసింహ, నాగేషు ,పాండు, బసవయ్య ,వెంకటేశు,బాలకృష్ణ ,జంగయ్య ,పాండు ,సంతోష్ పాల్గొన్నారు.