Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన బరిగెల సాయిరామ్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును ఆదివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి లబ్దిదారునికి అందజేశారు.బీజేపీ మండల నాయకులు గుదె మధుసూదన్ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీఎం సహాయ నిధి నుంచి రూ.60 వేలు మంజూరు చేయించగా ఆ చెక్కును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందజేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి జిల్లా అధక్షులు పీవీ.శ్యామ్సుందర్రావు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రాధారపు మల్లేశం, నాయకులు గుదె మధుసూధన్, గోర్ల నరేందర్, బరిగెల రామనర్సింహ, పబ్బు రవి తదితరులు పాల్గొన్నారు.