Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
- కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మేడే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రజలకు పిలుపునిచ్చినారు.ఆదివారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాల్లో భాగంగా జెండాను గ్రామసీనియర్ నాయకులు రాసాల వెంకటేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యతకు విఘాతం కలిగించే మతోన్మాద కార్మికవర్గ వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలని కోరారు. మోడీ ప్రభుత్వం పోతేనే కార్మికుల ప్రజలహక్కులను దేశాన్ని కాపాడుకోగలమన్నారు.కార్మికుల, ప్రజలు బాగు కోసం సంక్షేమం కోసం, కొత్త హక్కుల కోసం కొట్లాడిసింది పోయి ఉన్న హక్కుల పరిరక్షణ కోసం చట్టాల కోసం మోడీ ప్రభుత్వంలో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని ప్రభుత్వరంగాన్ని, భారత రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తున్నదని,దీనికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.మోడీ ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు వంటనూనె, గ్యాస్, పెట్రోలు ధరలు పెంచి సామాన్య మానవులకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పోరాటాలు చేసి తెచ్చుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తుందని, అడవి హక్కుల చట్టము, సమాచార హక్కు చట్టము కూడా లేకుండా చేయాలని చూస్తుందని, ప్రభుత్వ రంగమైన రైల్వే, ఎల్ఐసి, పోస్టల్ టెలికాం లాంటి అనేక జాతీయ స్థాయి పరిశ్రమలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని చూస్తుందన్నారు.ఈ ప్రభుత్వము సామాన్య ప్రజలను మరిచి కార్పొరేట్శక్తులకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. భారతదేశ వ్యాపితంగా మతోన్మాదాన్ని పెంచి పోషించి ప్రజల మధ్య చిచ్చును లేపి తన పాలను కొనసాగించాలని కుట్రలు చేస్తుందన్నారు.దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా రానున్న కాలంలో బీజేపీని దేశంలో అధికారంలోకి రాకుండా నిలువరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాలనర్సింహ, మండలకార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య,సీపీఐ(ఎం) గ్రామ నాయకులు ఉడత విష్ణు, మద్యపురం బాలనర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత సత్యనారాయణ, కొండ్రి వెంకటేష్, చిక్కుల చంద్రమౌళి, మచ్చమధు, ఎండి రహిమాన్,కె.శ్రీను పాల్గొన్నారు.