Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూర్
హైదరాబాద్‌లోని సరూర్ నగర్లో నేడు జరిగే నిరుద్యోగ నిరసన గర్జనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నకిరేకల్ నియోజకవర్గ పీసీసీ పరిశీలకులు మర్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కట్టంగూర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ నిరసన గర్జనకు ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ హాజరుకానున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం నిరుద్యోగ నిరసన గర్జన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, కేతేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ బోళ్ళ వెంకట్‌రెడ్డి, కేతేపల్లి ఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్, మాజీ ఎంపీపీ రెడ్డిపెళ్లి వెంకటమ్మ సాగర్, కౌన్సిలర్ గాజుల సుకన్య, జిల్లా కార్యదర్శి మాద లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెరుకు యాదగిరి, నాయకులు రెడ్డిపల్లి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.