Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారిఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండ
ఉపాధి పని చేస్తున్న సమయంలో ట్రాక్టర్ కాలుపై వెల్లి గాయపడిన దెందె మల్లయ్యకు వైద్య ఖర్చులతో పాటు గాయం బాగై పనికి వెల్లె వరకు వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కాలుకు గాయమై పద్దెనిమిది కుట్లు పడి నల్లగొండ ప్రభుత్వ హస్పటల్లో చికిత్స పొందుతున్న ఉపాధి కూలీ దెందె మల్లయ్యను వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి బృందం పరమర్శించారు. ఈ సందర్బంగా నారిఐలయ్య మాట్లాడుతు పనిచేసిన సందర్బంగా ఎలాంటి ప్రమాదం జరిగిన ఆ కూలీ చికిత్సతో పాటు బాగయ్యె వరకు మందులు రోజు 272 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన విధంగా కట్టించాలని చట్టంలో ఉన్న విధంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ఇప్పటి వరకు ప్రమాదానికి గురై నల్లగొండ హస్పటల్స్ చికిత్స పొందుతున్న కార్మికున్ని సంబంధిత అధికారులు చూడక పోవడం చేస్తుంటే కార్మికుల యడల ఉపాధి చట్టం యడల ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో దిన్ని బట్టి అర్ధమవుతున్నదని విమర్షించి అందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు దండంపల్లి సరోజా, గండమల్ల రాములు,మన్నే బిక్షం, సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.