Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడరూరల్
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు రూరల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలిసి ఆయన రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీరచారు.నామ్‌రోడ్డు, ఎన్‌హెచ్ 167పై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే శ్రీనివాస్‌నగర్ గ్రామం కేసీ ఫంక్షన్‌హాల్ దగ్గర, సంబంధిత రోడ్డు హైవే ఆథారిటీ వారితో, నేషనల్ హైవే ఏఈతో ఆ ప్రదేశాలను సందర్శించి అక్కడ రోడ్డు పక్కన ఉన్నచెట్లను తొలగించారు. ఆ ప్రదేశంలో బోలాడ్స్, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేశారు.గూడూరు, కొత్తగూడెంలో వద్ద మెయిన్జంక్షన్లలో లైటింగ్, రంబుల్ స్ట్రిప్స్ బోలాడ్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నామ్ రోడ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజు, షైక్ మహ్మద్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.