Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మండలంలోని రామన్నగూడెం గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశం మేరకు సోమవారం రామన్నగూడెం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అంధత్వంలేని రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జీడిభిక్షం, సర్పంచ్ మల్లయ్య, డాక్టర్ సాగరిక, హెల్త్ సిబ్బంది రోజా,ఉపేంద్ర,జానీభేగం, , జానమ్మ, ఆశావర్కర్లు రమణ,పుష్ప, అంగన్వాడీ టీచర్లు పుష్ప,వీబీకే వెంకటమ్మ, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.