Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యాక్రమంలో ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించి మాట్లాడారు.ప్రతి సోమవారంప్రజావాణిలో వివిధ శాఖలకు చెందిన దరఖాస్తుల పెండింగ్ వివరాలను సమీక్షిస్తామన్నారు.అధికారులు సంబంధిత వివరాలతో ఉదయం 10 గంటలకు ప్రజావాణికి హాజరుకావాలని సూచించారు. ప్రజావాణిలో 54 దరఖాస్తులు రాగా వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వేబిక్స్ ద్వారా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుండి మండల తహసీల్దార్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు రవాణా చేయాలని, ధాన్యం రవాణా కొరకు ట్రాక్టర్లను వినియోగించాలని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామన్నారు.అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం పట్ల రైతులు అపోహ పడవద్దన్నారు.ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.ప్రత్యేకాధికారులు వారికి కేటాయించిన కొనుగోలుకేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ధాన్యం రవాణా వేగవంతమయ్యేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్.మోహన్రావు, జెడ్పీ సీఈఓ సురేష్కుమార్, ఇన్చార్జి డీఆర్ఓ రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీదేవి,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.