Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
అర్హులైన ప్రతి గీత కార్మికునికి సభ్యత్వం,లైసెన్స్లు, గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మునగాలలో గీత కార్మికుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా తాటి చెట్లు ఎక్కుతున్న గీత కార్మికులకు వెంటనే టీఎఫ్టీ లైసెన్సులు, గుర్తింపుకార్డులివ్వాలని కోరారు.గుర్తింపు కార్డుల ద్వారానే ప్రభుత్వం గీత కార్మికులకు సంక్షేమపథకాలు వర్తించే అవకాశం వుందన్నారు.50 ఏండ్లు నిండిన ప్రతిగీత కార్మికునికి వృద్దాప్య పెన్షన్ వస్తుందని చెప్పారు. ప్రమాదశావత్తు తాటి చెట్టు పైనుండి పడి గాయపడిన మృతి చెందిన సభ్యత్వాలు, లైసెన్సులు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయని గుర్తుచేశారు.గీతవృత్తి చాలా ప్రమాదకరమైందని తెలిపారు.గీత కార్మికులు చాలా జాగ్రత్తతో తాడిచెట్లు ఎక్కాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో టాడి టాపింగ్ టెస్టులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది ఎండి సలీం,నాగరాజు,కల్లు గీత కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు మామిడి శ్రీను మండల కార్యదర్శి కాసాని వీరస్వామి,నారగాని వెంకన్న,కొండ రామాంజి, మామిడి గురునాథం, బత్తిని రామ కృష్ణ, నారగానిరాంబాబు, మండల శేషు, నారగాని గోపి, మండవ రాంబాబు, మామిడి చెర్రీ, వెంకన్నగౌడ్, కల్లు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.