Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
న్యాయస్థానంలో కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం ఎంతైనా అవసరమని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ అన్నారు.సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జూనియర్ సివిల్ కోర్టులో ఎనిమిది వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.ఆ పెండింగ్ కేసులను తగ్గించడానికి న్యాయవాదులు సహకరించాలన్నారు. చట్ట పరిధిలో తాను కూడా న్యాయవాదులకు సహకరిస్తానన్నారు సీనియర్ సివిల్ జడ్జి జిట్ట శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయ పీఠానికి న్యాయవాదుల సంఘానికి మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు. అప్పుడే న్యాయస్థానంలో కార్యకలాపాలు సక్రమంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులను న్యాయవాదులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాముల రామిరెడ్డి,జక్కుల నాగేశ్వరరావు, న్యాయవాదులు వీజీకే.మూర్తి, కాలువ శ్రీనివాసరావు, చల్లా కృష్ణయ్య, నట్టె సత్యనారాయణ, మాధవరెడ్డి, అంజయ్య, రమణారెడ్డి,సీహెచ్.యాదగిరి,నాగార్జున, క్రాంతికుమార్, సురేష్, కె.రమాదేవి, జక్కుల వీరయ్య, సుంకర ప్రదీప్తి, చంద్రయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.