Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఇంటర్మీడియట్ ఫలితాల్లో చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ 2023 సంవత్సర ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం చాటారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో ఎన్.శ్రీజ 465, ఎస్.కార్తీక్ 464, ఎమ్‌డి.హనీఫ్ 464, సీహెచ్.ప్రమీల 464, వై.అభినరు 464, ఎ.నవ్య 463 మార్కులు సాధించారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో పి.రాజశ్రీ 434, ఎస్.బిందు 433, ఎస్.శరణ్య 432 మార్కులు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో జి.వాణి 989, కె.స్పందన 986, ఆర్.దీక్షిత 985, బి.శివసాయి 981 మార్కులు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో వై.షణ్ముఖప్రియ 987, ఎస్.అశ్విని 984, ఎస్కె.శిమషరీన్ 982, యు.శ్రీవాణి 980 మార్కులు సాధించారు. సీఈసీ ప్రథమ సంవత్సరంలో ఎమ్‌డి.సానియా 436, సీఈసీ ద్వితీయ సంవత్సరంలో యు.గోమాతి 949 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 400కుపైగా 53 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 900కుపైగా 70 మంది విద్యార్థులు మార్కులు సాధించారని శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛైర్మన్ బండారు మయూర్‌రెడ్డి, కరస్పాండెంట్ భీమిడి సుభాశ్‌రెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆదినారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.