Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఇంటర్ ఫలితాలలో రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ రాష్ట్రస్థాయి సెకండ్ ర్యాంకులు ముగ్గురు విద్యార్థులు సాధించి ప్రభంజనం సృష్టించిందని ఆ విద్యాసంస్థల చైర్మెన్ బాణాల వసంతవెంకట్రెడ్డి తెలిపారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన గుడవర్తి హర్షిని 466/470, కంచర్ల అక్షర 466/470, నెల్లూరి స్రవంతి 466/470, జూనియర్ బైపీసీ విభాగంలో షేక్ రుక్సానా 431/440 , సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఉయ్యాల అక్షర సమైక్య 991 /1000, వేమూరి రామ్ చరణ్ 991/1000, సీనియర్ బైపిసి విభాగంలో కుందూరి హరిణి 983/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్. మెడికల్ విభాగంలో ర్యాంకులు సాధించడంతో పాటు, రాష్ట్రస్థాయిలో ఇంటర్ విభాగంలో ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తున్నామని, భవిష్యత్తులో రానున్న ఫలితాలలో కూడా మా సంస్థ ముందంజలో ఉంటుందని తెలిపారు, విద్యార్థుల ర్యాంకులకు కృషిచేసిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.కృష్ణారావు, కళాశాల డీన్ ఆర్కె, నర్సింహారెడ్డి, ఎంజీ.రెడ్డి,రవితేజ, శేషాద్రి, జియావుద్దీన్ అడ్వకేట్ ఉయ్యాల నర్సయ్య, వేమూరి కృష్ణయ్య, అడ్వకేట్ శరత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.