Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.్ణమంగళవారం సీపీఐ(ఎం),తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), రైతుసంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.చేతికొచ్చిన పంటను అమ్మడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలకు తీసుకెళితే సరైన సౌకర్యాలు లేక వర్షంలో పంట కొట్టుకుపోయిన పరిస్థితి ఉందన్నారు.ఐకెపి కేంద్రాల్లో దాన్యం తడిసి ముద్దవ్వడంతో ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు.వెంటనే అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంటాలు వేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని అన్నారు. లోడింగ్, అన్లోడింగ్, హమాలీల విషయంలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి ధాన్యం కాంటాలు ఎగుమతి అయ్యే విధంగా చూడాలన్నారు. తేమ,తాలుపేరుతో మిల్లర్లు బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీయడం సరికాదన్నారు.లోడింగ్ అయిన ధాన్యం బస్తాలను మిల్లర్లు అన్లోడ్ చేసుకునే విషయంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.వడగండ్ల వానతో మామిడి, బత్తాయి, నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.జిల్లా, మండల స్థాయిలో రెవెన్యూ అధికారులు గ్రామాలలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎలుగూరి గోవిందు, వేల్పుల వెంకన్న,జె.నర్సింహారావు, మేకనబోయినశేఖర్, చినపంగి నరసయ్య, దేవరం వెంకటరెడ్డి,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు తెలంగాణ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్‌రెడ్డి, బెల్లంకొండ సత్యనారాయణ, వజ్జే శ్రీను, ఉప్పలయ్య, వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డి, స్టాలిన్‌రెడ్డి, జ్యోతి, లింగయ్య, ప్రజా సంఘాల నాయకులు సాయికుమార్, సుందరయ్య, సీతారాములు, రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.