Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన
నవతెలంగాణ-మిర్యాలగూడ
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు.మిర్యాలగూడ మండలం అవంతీపురం మార్కెట్యార్డులోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు.వీరికి కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించిందని చెప్పడం వరకే ఉందన్నారు.కొనుగోలు మాత్రం జరగడం లేదని సర్కారు తీరుపై మండిపడ్డారు.ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి 15 రోజులు దగ్గర పడుతున్న కొనుగోలు చేయడం లేదన్నారు.ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.ఇకనైనా ప్రభుత్వం,అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకున్నారు.రైతుల ఆందోళనతో కోదాడ-జడ్చర్ల రహదారి వెంట కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించింది.రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేశారు.