Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం పోరాటం చేసిన మహాయోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 60 ఫీట్‌రోడ్డులో బీఎన్.రెడ్డి విగ్రహానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంరజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పర్చడంలో బీఎన్.రెడ్డి కీలక పాత్ర పోషిం చారన్నారు. తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంతో వేలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు.బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టు శ్రేణులు పోరాటాలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదగిరిరావు, నెమ్మాదివెంకటేశ్వర్లు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు గోవిందు ,జె.నర్సింహారావు, చినపంగి నర్సయ్య, ఎం.శేఖర్, ఎం.రాంబాబు, ఎం.సుందరయ్య, మల్లు వెంకటరామిరెడ్డి, సీతారాములు, సైదులు తదితరులు పాల్గొన్నారు.