Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికల ఉత్తీర్ణత శాతం 90.5
- బాలుర ఉత్తీర్ణత శాతం 88.73
- నల్లగొండ జిల్లా ఉత్తీర్ణత శాతం 89.59
- రాష్ట్రస్థాయిలో జిల్లా 17వ స్థానం
- 39పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
- యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తీర్ణత శాతం 80.97
- రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాకు 15వ స్థానం
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదలచేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 90.5శాతం ఉత్తీర్ణత సాధిం చారు. కాగా, మొత్తం 89.59శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 480 ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి మొత్తం 19,236మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,234(89.59 శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. 2002మంది ఫెయిల్ అయ్యారు. 9886 మంది బాలురకు 8772 మంది (88.73శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 9350 మంది బాలికలు హాజరు కాగా, 8462 మంది (9.5శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 39 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు . కాగా, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, డీఈవో బొల్లారం బిక్షపతి అభినందించారు.
పదవ తరగతి ఫలితాలలో 26వ స్థానంలో యాదాద్రి జిల్లా....
13 నుంచి 26 కు పడిపోయిన ఉత్తీర్ణత శాతం....
భువనగిరి రూరల్:యాదాద్రి భువనగిరి జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయం విడుదల చేసిన ఘనంకాల ప్రకారం 8973 మంది విద్యార్థులకు 7265 మంది ఉత్తీర్ణత సాధించగా 80. 97 శాతంగా ఉత్తీర్ణత శాతం నమోదయింది. కాగా 2021- 22 సంవత్సరంలో 9400 మంది విద్యార్థులకు 8799 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 93.61 శాతంగా నమోదయింది. రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నీలిచింది. కాగా 13వ స్థానం నుంచి జిల్లా ఉత్తీర్ణత శాతం 26వ శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ సంవత్సరం జిల్లాలో బాలుర్లు 4435 మందికి గాను 34 39 మంది ఉత్తీర్ణత సాధించి 77.54 శాతంగా నమోదయింది. బాలికలు 4538 మంది విద్యార్థులకు గాను 3826 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 84.31 శాతంగా ఉత్తీర్ణత నమోదయింది. మొత్తంగా పరిశీలిస్తే ఉత్తీర్ణత శాతం 80.97 శాతంగా నమోదు కాగా , గత సంవత్సరం 13వ స్థానంలో ఉన్న జిల్లా 26వ స్థానానికి పడిపోవడం పై విద్యావేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు, స్నాక్స్ అందిస్తూ విద్యార్థులకు పరీక్షల పట్ల భయం పోగొట్టి ఉత్తమ ఫలితాలు సాధించేలా పూర్తిస్థాయిలో కృషి చేయాల్సి ఉంది.
పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
గతేడాది కంటే మెరుగైన స్థానం
జిల్లాకేంద్రంలో 47 మంది10 జీపీఏ సాధించిన జయ టాలెంట్స్కూల్
సూర్యాపేట:రాష్ట్ర విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గతంలో 16 వ స్థానానికి పరిమితం కాగా ఈ సంవత్సరం మాత్రం రాష్ట్రంలో 15 వ స్థానం సాధించి మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లా 89.93శాతంఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 15వ స్థానంలో నిలిచింది.జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 12,190 మంది విద్యార్థులు హాజరు కాగా 10963 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇందులోజిల్లాలో బాలురు 88.8 శాతం ,బాలికలు 91.14శాతం ఉత్తీర్ణత సాధించారు.పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో విద్యార్థులు సాధారణ ఉత్తీర్ణత శాతం సాధించారు.ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో పలుపాఠశాలలో 10,10 జీపీఏ సాధించి విజయదుందుభి మోగించాయి.కాగా పట్టణంలోని జయ టాలెంట్ స్కూల్ కు చెందిన 47 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఏ సాధించి రీకార్డు సృష్టించారు.