Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మండలకేంద్రం ప్రాథమికఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న పనులను బుధవారం డీఎంహెచ్ఓ కోటాచలం పరిశీలించారు.సబ్సెంటర్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అరోగ్యరక్షణ కోసం నిధులు కేటాయించి అభివద్ధి చేసిందన్నారు.18నుండి 22 నుండి వారాల గర్భిణీ స్త్రీల లోపాలను గుర్తించి టీపా స్కానింగ్ ద్వారా లోపాలుగుర్తి స్తామన్నారు.ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు.ప్రభుత్వాస్పత్రుల్లో సహజకాన్పుల సంఖ్య పెంచాలని కోరారు .గర్భిణులకు,చిన్న పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో ఓఆర్ఎస్డిపో ఏర్పాటు చేసి ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని అరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లెలవందన,సీహెచ్ఓ మాలోతు బిచ్చునాయక్, నర్సింహారెడ్డి, రమాదేవి, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.