Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఆర్టీసీ మాజీ ఉద్యోగి, సీపీఐ(ఎం), సీఐటీయూ మాజీ నాయకులు ఇమామ్ ఖాన్ సేవలు చిరస్మరణీయం అని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇమామ్ ఖాన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. బుధవారం ఇమామ్ ఖాన్ మృతదేహానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డితో కలిసి పూలమాలలు వేసి పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఇమామ్ ఖాన్ తోటి ఉద్యోగులకు కష్టసుఖాల్లో అండగా ఉండేవారని కొనియాడారు. సీఐటీయూ నాయకులుగా ఆయన సేవలు అభినందనీయం కొనియాడారు. ఇమామ్ ఖాన్ తుది శ్వాస విడిచే వరకు సీపీఐ(ఎం) అభివృద్ధికి అండగా నిలిచారన్నారు. నార్కట్‌పల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం భవన నిర్మాణానికి ఇమామ్ ఖాన్ సేవలందించారని పేర్కొన్నారు. నేటి యువత ఇమామ్‌ఖాన్ సేవలు గుర్తించి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హశం, ఎండీ.సలీం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఆర్. వెంకటేశ్వర్లు, పుచ్చకాయల నర్సిరెడ్డి, మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మాజీ మండల కార్యదర్శి గాలి నరసింహ, మండల కమిటీ సభ్యులు చింతపల్లి బయన్న, కొప్పు శ్రవణ్, దండు రవి, ఆమనగంటి నరేష్, అర్థం శ్రీను, మంద గోపాల్, ఎస్కే.నన్నేసాబ్, ఆమనగంటి వెంకన్న, యూసుఫ్, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.