Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి భూ సేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, ఆర్ అండ్ ఆర్ కింద పునరావాస చర్యలు వేగ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిండి ఎత్తి పోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణ భూ నిర్వాసితులు, ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్‌ల సంబందించి భూసేకరణ, నిర్వాసితులకు చెల్లింపు, పునరావాస చర్యలు ప్రగతిపై అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, ఇరి గేషన్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్ట్‌ల వారీగా సమీక్షించారు. డిండి ఎత్తి పోతల పథకం కింద నిర్మాణం చేస్తున్న సింగరాజుపల్లి, గొట్టి ముక్కల, కిష్ట రాయినిపల్లి, శివన్న గూడెం, చింతపల్లి బ్యాలెన్సింగ్ రి,డిండి మెయిన్ కెనాల్, ఏఎంఆర్పీ కింద ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్వాసితులకు భూ సేకరణ నష్ట పరిహారం చెల్లింపు, అయిటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పెద్ద గట్టు, కంభాల పల్లి, పోగిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పై సమీక్షించారు. కిష్ట రాయినిపల్లి రిజర్వాయర్ కింద ముంపుకు గురయ్యే నాంపల్లి మండలం లక్ష్మణ పురం, చింతపల్లి మండలం ఈదుల గండి గ్రామాల నిర్వాసితులకు చింతపల్లి భూ కేటాయింపు చేసి అర్ అండ్ ఆర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. శివన్న గూడెం రిజర్వాయర్ నిర్వాసిత గ్రామాలకు సంబందించి పునరావాస ప్రక్రియ పై కూడా కలెక్టర్ సమీక్షించారు. అయిటి పాముల కెనాల్ పనులకు మార్కింగ్ పూర్తి చేసి పనులు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎల్ఏ, అర్ అండ్ అర్ యూనిట్ 1 ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రోహిత్ సింగ్, దేవర కొండ ఆర్డీఓ గోపి రాంనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.