Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో స్థానిక హౌసింగ్ బోర్డులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. నూరు శాతం ఉత్తీర్ణతతో పట్టణంలోనే ప్రథమ స్థానం పొందారు. డీ. సాయి ప్రదీప 10 జీపీఏ, పి. లక్ష్మీ చక్ర అఖిల 9.8, జీ. సంజన రాజ్, 9.7, ఏ. సత్యప్రియ, 9.5, ఏ. ప్రతీక, వి. వెన్నెల, చీదళ్ళ ఫణి కుమార్, జి. సాత్విక్‌లు అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.కె జయరాజన్ తెలిపారు. విస్తృత మైన ప్రణాళికతో, బోధనా సిబ్బంది సహకారం తో మొదటి నుండి అవిశ్రాంతంగా శ్రమించడం వలన ఈ ఫలితాలు దక్కినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు అందరూ బాగా చదివి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయనతోపాటు ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, అబ్దుల్ ఖలిం, వినోద్ చంద్రన్,వై. ప్రసాద్, జి. రాంబాబు, ఎం. అనిల్ కుమార్, ఎం. నవీన్ కుమార్, ఎండీ. జహంగీర్, ఎండీ. అజహరుద్దీన్, రమేష్, మధు నాయర్, రవి కుమార్, ఉదరు కిరణ్‌లు అభినందించారు.