Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మెన్ గొంగిడిమహేందర్ రెడ్డి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కాచారం గ్రామానికి చెందిన బీబీనగర్ లక్ష్మణ్ ,రామ్ నాయకత్వంలో 200 మంది కాంగ్రెస్కు రాజీనామా చేసి గొంగిడి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందాయన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు.దేశంలో కూడా రైతు ప్రభంజనంతో బిఆర్ఎస్ ముందుకు వెళ్తుందని తెలిపారు.యాదాద్రి టెంపుల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు.రాబోయే ఎన్నికల్లో ఆలేరులో గులాబీ జెండా ఎగిరేసేందుకు కార్యకర్తలు కార్యోన్ముకులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్రే వెంకటయ్య ,మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీద రవీందర్ గౌడ్, జెడ్పిటిసి తోటకూరి అనురాధ ,పిఎసిఎస్ చైర్మెన్ఇమ్మడి రామిరెడ్డి ,రైతు సమన్వయ సమితి సభ్యులు మిట్ట వెంకటయ్య , బీసీసెల్ అధ్యక్షులు కావిడేమహేందర్ కాచారం సర్పంచ్ కె అరుణఅశోక్ రెడ్డి ,మాజీ సర్పంచ్ నరహరి ,ఉపసర్పంచ్ పుట్ట శ్రీనివాస్ ,బిఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి ,సలిం, బాల్రెడ్డి ,ఇప్ప శీను దాడిగేశోభ తదితరులు పాల్గొన్నారు.