Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షుడు యాదగిరి
నవ తెలంగాణ -మోత్కూర్
ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దీంతో ప్రస్తుతం ఇస్తున్న కూలి డబ్బులు కుటుంబాలను పోషించుకోవడానికి సరిపోనందున కేంద్ర ప్రభుత్వం రోజు కూలి రూ. 600లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మెతుకు అంజయ్య, కప్ప విజయ, బండ వనజ, బండ ముత్తమ్మ, బండ సత్తమ్మ, బండ పద్మ, బండ పార్వతమ్మ, బండ శోభ, బండ కల్పన, బండ సంధ్య, గూడిపూరి ఎల్లమ్మ, కంభంపాటి సైదమ్మ, లింగమ్మ, నర్సమ్మ, మల్లమ్మ, మాతమ్మ, నాగమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.