Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు 'కార్పొరేట్' వల
- అడ్మిషన్ల కోసం పలు ప్రవైట్ కళాశాలల హడావుడి
- పీఆర్వోలు, ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లు
- ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటే ఫీజులో రాయితీ అంటూ
- నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కళాశాలలు
నవతెలంగాణ-సూర్యాపేట
కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్ల కోసం పడుతున్న హైరానా అంతా ఇంతా కాదు. అందులో పెరు మోసిన విద్యా సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి.ఇంటర్, పది పరీక్షల ఫలితాలు రావడంతో అడ్మిషన్ల కోసం ఆరాటపడుతున్నాయి.విద్యా సామ్రాజ్యాన్ని తమ గుప్పిట పట్టి.. విద్యార్థులతో పాటు, తల్లిండ్రులను మోసం చేస్తూ కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఒక మాఫియా ముఠాగా తయారయ్యాయి.పారదర్శకంగా ఉండాల్సిన విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా.. అడిగే నాథుడు లేక పోవడం గమనార్హం. పదో తరగతి విద్యార్థుల సమాచారాలు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించి విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పుడైతే ఫీజుల్లో ఆఫర్లు ఉన్నాయంటూ ఆశ చూపుతున్నారు.నిబంధనల ప్రకారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మాత్రమే విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ ఆ నిబంధనలను కొన్ని కళాశాలలు పట్టించుకోవడం లేదు.
రాయితీ పేరుతో నమ్మబలుకుతూ....
పీఆర్వోలు, ఉపాధ్యాయులు పడుతున్న హైరానా...
ఉపాద్యాయులు, ఉద్యోగులు అప్పుడే తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. పదో తరగతి,ఇంటర్ విద్యార్థుల సమాచారం, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించి వచ్చే విద్యా సంవత్సరంలో తమ కళాశాలల్లో విద్యా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అడ్మిషన్ల కోసం వల విసురుతున్నారు. క్రమంలో విద్యార్థులతో పాటు, తల్లి దండ్రులను పలు కమీషన్లకు ఆశ పేడుతున్న కొందరు ప్రభుత్వ, కళాశాలలు ఒక మాఫియా ముఠాగా ఏర్పడినట్లు తెలుస్తోంది.ప్రయివేట్ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లోని పారదర్శకంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారాన్ని ప్రయివేట్ కళాశాలలకు చేరవేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్లు కళాశాలలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.కళాశాలల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలలో చేర్పించండి అంటూ కళాశాలలు అడ్మిషన్ల కోసం ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఇతర ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కార్పొరేట్ కళాశాలు కమీషన్ల ఆశ చూపుతుండడంతో ఆయాప్రయివేట్ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థుల జాబితాలు, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లను ఈ కళాశాలల యాజమాన్యాలకు అందిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ కళాశాలలను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేస్తున్నా.. ప్రయివేట్ కళాశాలల్లో అడ్మిషన్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో ఆడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండడం ఇబ్బందికరంగా మారింది.
ప్రయివేట్ కాలేజీల పీఆర్వోలు విద్యార్థుల అడ్మిషన్ల కోసం.. ఆరాటం !
విద్యార్థుల సమాచారాలు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించి విద్యార్థులను తమ కాలేజీల్లో చేర్చుకు నేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఫీజులో ఆఫర్లు ఉన్నాయంటూ ఆశ చూపుతున్నారు. నిబంధనల ప్రకారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మాత్రమే విద్యార్థులను చేర్చుకోవాలి. కానీ ఆ నిబంధనలను హైదరాబాద్ లోని కార్పొరేట్ కళాశాలలు పట్టించుకోవడం లేదు.
కాసుల కోసం కక్కుర్తి తప్ప....
కాసుల కోసం కక్కుర్తి తప్ప..విద్యార్థుల బాగోగులు.. వారికి విద్యాబుద్ధులు చెప్పడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు వలవిసురుతున్నారు. పీఆర్వోలు, సూపరింటెండెంట్లతో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడించడం, పిల్లలను తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు సిబ్బందితోనే అడ్మిషన్లు బుక్ చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో పీఆర్వోలకు కమీషన్లు కూడా పోటీపడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.ముందుగా ఆడ్మిషన్ తీసుకున్న విద్యార్థికి రూ.7 వేలు ఆఫర్ ఇవ్వడంతో పాటు, అడ్మిషన్లు రాయించే పీఆర్వోలు, ఉపాధ్యాయులకు ఒక్కో విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు కమీషన్ అందిస్తున్నారు. అంతే కాదు ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు ఇస్తే అదే స్థాయిలో కమీషన్ కూడా పెంచుతామని ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగాతల్లిదండ్రులను కలిసి తమ కాలేజీల్లో చదివితే ఎంఎస్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ నీట్ కోచింగ్ ఇస్తామని, సీటు గ్యారంటీ అని చెప్పి అడ్మిషన్లు చేయిస్తున్నారు.అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి కోచింగుల్లేకుండా కేవలం ఇంటర్ విద్యా బోధనే ఉండటంతో తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రయివేట్ కళాశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.దీంతో ప్రయివేట్ కాలేజీలకు ధీటుగా ఇంటర్ విద్యను బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు..మాటలుగానే మిగులుతున్నాయి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందమైన భవనాలు, అన్ని అర్హతలున్న లెక్చరర్లు, ల్యాబ్లు, ఇతర సౌకర్యాలున్నా..ఇంజనీరింగ్, మెడికల్ కోచింగుల్లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా మారింది.