Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ
నవతెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి మండల పరిధిలో బస్వాపురం రిజర్వాయర్ నుంచి సొక్ల తండా పరిధిలో తుమ్ము ఏర్పాటు చేసి, వాడపర్తిలోని అగా చెరువు నింపి, దాని ద్వారా వాడపర్థి కత్వా లోనికి నీళ్ళు నింపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా కోరారు. గురువారం ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సొక్లా తండాను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాడపర్తి కత్వాను నిపండం ద్వారా భువనగిరి మండలము తోపాటు భువనగిరి టౌన్, బీబీనగర్ మండలం , వలిగొండ మండలం, ఆత్మకూరు, మోత్కూరు వరకు ఈ కత్వా ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. రైతుల కోసం వెంటనే సోక్ల తండా నుండి వాడపర్తి కత్వా వరకు రైతులతో మాట్లాడి, కాలువను సర్వే చేసి , కాల్వను ప్రారంభించి , ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహా, మండల కార్యదర్శ వర్గ సభ్యులు ఎదునూరి మల్లేష్, మందల కమిటీ సభ్యులు పండాల మైసయ్య, మోటే ఎల్లయ్య, తెల్జూరి మాణిక్యం పాల్గొన్నారు.