Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ- నకిరేకల్
రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని తాటికల్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం పేరుకపోవడం పట్ల ఆరా తీసిన కలెక్టర్ వెంటనే కాంట్రాక్టర్ తో మాట్లాడి వెనువెంటనే లారీలను కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల డిఎం నాగేశ్వరరావు, అధికారులు ఉన్నారు.
సత్వరమే మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలి
చిట్యాలటౌన్: సత్వరమే మిల్లర్లు ధాన్యందిగుమతి చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు అన్నారు. చిట్యాలలో గురువారం ఏఎంసి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, మండలంలోని రైస్ మిల్లులను తనిఖీ చేసి యాజమాన్యానికి వీలైనంత తొందరలో ధాన్యం దిగుమతి చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల తహసిల్దార్ జక్కార్తి శ్రీనివాసులు, సివిల్ సప్లై ఆర్ఐ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.