Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుగడ కోసం పార్టీల ఆరాటం
- బీజేపీని ఓడించడమే లక్ష్యం
- జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ -నల్లగొండ
రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకూ జీవన్మరణ సమస్యగా ఉన్నదని, అన్ని పార్టీలు మనుగడ కోసం ఆరాటం పడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని దొడ్డి కోమరయ్య భవనంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ విస్తృత సమావేశం సయ్యద్ హశం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని ప్రజల మద్దతు కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో వేగంగా రాజకీయాలు మార్పు చేసుకుంటున్నాయని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు చేస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను వెలికి తీసి ఉద్యమాలు చేసి పార్టీ నిర్మాణ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఆయా పార్టీలు ఇస్తున్న హామీలు అమలుకు నోచుకునే విధంగా లేవని వాటిని ప్రజలకు వివరించి చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేయాలని అప్పుడే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. హామీల అమలు కోసం ప్రభుత్వం పై ఉద్యమాలతో ఒత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు. మోడీ మరోసారి అధికారులకు వస్తే ప్రజా సంపద కనుమరుగవుతుందని ఆరోపించారు ఒకే దేశం ఒకే మతం ఒకే పార్టీ విధానాన్ని అమలు చేయాలని మోడీ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షా..... ఆదాని అంబానీ.... ఆర్ఎస్ఎస్ తో దేశంలో త్రిబుల్ ఇంజన్ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చారు వాలా వాలా దేశాన్ని అమ్మేస్తున్నాడని ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తొమిదేళ్ల కాలంలో ఆర్థికంగా దేశం వెనుకబడిపోయిందని అప్లోదేశంగా మారిపోయిందని వాపోయారు. మోడీకి సన్నిహితంగా ఉండే పార్టీలన్నీ ఇప్పుడు మోడీ విధానాలను నచ్చక దూరమవుతున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని వివరించారు. దేశంలో బీజేపీ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మోడీని గద్దె దించే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయని అందులో భాగంగానే ఆయా ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, డి మల్లేష్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, కూన్ రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.