Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల టౌన్
చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు భువనగిరి రోడ్డులో ఇమ్మడి వెంకన్న ఇంటి నుండి కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి ఇంటి వరకు డ్రెయినేజీ నిర్మాణానికి మున్సిపాలిటీ చైర్మెన్్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి స్థానిక కౌన్సిలర్ సిలివేరు మౌనిక శేఖర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చైర్మెన్్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా డ్రెయినేజీ సమస్య ఉందని స్థానిక కౌన్సిలర్ సిలివేరు మౌనిక శేఖర్ తెలిపారని అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి సమస్య గురించి తెలపగా నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, జిట్టా పద్మా బోందయ్య, పలువురు బిఆర్ఎస్ నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.