Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఐఈఓ రమావత్ దస్రు నాయక్
నవతెలంగాణ -నార్కట్ పల్లి
అత్యంత ప్రతిభ కలిగిన,అనుభవజ్ఞులైన మేధావుల సారధ్యంలో బడుగు బలహీన వర్గాల, అన్ని వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య ఫలాలు అందించాలని లక్ష్యంతో నార్కట్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్ పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చో రవతో నూతన ఇంటర్మీడియట్ కళాశాల మంజూరు అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నార్కట్ పల్లి ,కట్టంగూర్ చిట్యాల మండలాల విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం వేయ ప్రాసులకు గురవుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సిన పరిస్థితి ఉండేది అలాంటి దుర్భరమైన స్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం వారి యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా విద్యాబోధన, ,పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు స్కాలర్షిప్ సౌకర్యం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కళాశాలలో ఎంపీసీ బైపీసీ, సీఈసీ, హెచ్ఇసి బాలికల కోసం ఎంపిహెచ్ డబ్ల్యు లతోపాటు ఎంఎల్టి వోకేషనల్ కోర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల కోసం సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఇస్మాయిల్ స్థానిక అధ్యాపకులు నడింపల్లి వెంకటేశ్వర్లు, ఎన్ వెంకన్న ఉన్నారు.