Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
నవ తెలంగాణ -కేతపల్లి
జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.గురువారంకలెక్టర్ మడలంలోని ఇను పాముల గ్రామం లోని ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. రైతులకు అందించుటకు సిద్ధముగా ఉన్న ఆయిల్ పామ్ మొక్కల వివరములను పతంజలి కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. 2023-24 ఏడాదికి జిల్లాకు కేటాయించిన 14,500 ఎకరముల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం సాధించాలని, డ్రిప్ పరికరములను సరైన సమయం లో రైతులకు అందించాలని, ఉద్యానశాఖ, పతంజలి కంపెనీ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాల్లో మూడు ఆయిల్ పామ్ నర్సరీల ద్వారా 8.20 లక్షల మొక్కలను రైతులకు సరఫరా చేయుటకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఉద్యాన శాఖ అధికారిణి వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన , పట్టుపరిశ్రమ శాఖ అధికారి జి. సంగీత లక్ష్మి, ఉద్యాన శాఖ అధికారులు రావుల విద్యసాగర్, రిషిత, తాసిల్దార్ ఎం మధుసూదన్ రెడ్డి ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ మండల వ్యవసాయ అధికారి బి పురుషోత్తం, పతంజలి ఫుడ్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
ఇనుపాముల గ్రామం లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని, నర్సరీని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో అత్యంత సున్నితమైనది కళ్ళని, వయస్సు పైబడుతున్న, చూపు మందగిస్తున్న వారు అలక్ష్యం చేయక వెంటనే కంటి వెలుగు శిబిరాలలో ఉచితంగా నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలు చేసుకొని సరైన కళ్ళ జోడు వాడాలని అన్నారు.కంటి వెలుగు శిబిరం లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరు, రికార్డులను, కంటి అద్దాలు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
త్వరత గతిన ధాన్యంను కొనుగోలు చేయాలి
ధాన్యం కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
మునుగోడు:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యమును కొనుగోలు చేయాలని నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని మునుగోడు ఊకోండి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు రైతులు , కొనుగోలు నిర్వాహకులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పోసిన ధాన్యం వర్షానికి తలవకుండా ధాన్యమును వడ్లపట్టాలతో భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు . మెండల కేంద్రంలోని మురళి మనోహర , మల్లికార్జున రైస్ మిల్లులను పరిశీలించి ధాన్యం దిగుమతులలో నిర్లక్ష్యం వహించకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు ఆదేశాలను జారీ చేశారు ఆయన వెంట మునుగోడు మండల తాసిల్దార్ కృష్ణారెడ్డి ,డిటిసిఎస్ విజయ తదితరులు ఉన్నారు.