Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండరూరల్
మండలంలోని పహిల్వాన్ పురం -టేకుల సోమవారం గ్రామాల మధ్యన అధ్వానంగా మారిన బీటి రోడ్డును వెంటనే నిర్మాణం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యుడు చీర్క శ్రీశైలం రెడ్డి డిమాండ్ చేశారు. హిల్వాన్పురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో గుంతలమయమైన రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన ప్రజలుగ ుంతలమాయమైన రోడ్డుపై రాకపోకలు సాగించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ సహాయ కార్యదర్శి రాగీరు కృష్ణస్వామి,రేపాక ముత్యాలు,గ్రామస్థులు ఏలిమినేటి మల్లారెడ్డి,గడ్డమీది దనుంజయ్య,గంగాదారి నర్సింహ,ఏనుగు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.