Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8వ వార్షికోత్సవం కరపత్రం విడుదల
నవతెలంగాణ -ఆలేరుటౌన్
శ్రీ కనకదుర్గాదేవి 8వ వార్షికోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పట్టణ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ చైర్మెన్ కొలుపుల హరినాథ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడి సమక్షంలో కరపత్రం ఆవిష్కరించారు. నాలుగు రోజులపాటు నిర్వహించే వార్షికోత్సవం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. 28వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు గణపతి పూజ , పుణ్యవచనం, రిత్విక వరణం, అమ్మవారికి అభిషేకములు, కలశస్థాపన , అర్చన , తీర్థ ప్రసాద వితరణ ,సాయంత్రం 6 గంటలకు అర్చన , తీర్థ ప్రసాద వితరణ, 29 వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు నిత్య పూజ, పారాయణం, అమ్మవారి హౌమం, సాయంత్రం నాలుగు 35 నిమిషాలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కనకదుర్గాదేవి, మల్లీశ్వర స్వామి కళ్యాణ మహౌత్సవం, నిత్య పూజ, తీర్థ ప్రసాద వితరణ, 30వ తేదీ మంగళవారం ఉదయం నిత్య పూజ, తీర్థ ప్రసాద వితరణ, ఉదయం 8 గంటల నుండి అమ్మవారికి బోనాలు సమర్పించుట, 31వ తేదీ బుధవారం రోజు బంధుమిత్రులతో వనభోజనాలు , చెట్ల కిందికి వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, మంగ నరసింహులు, యేలుగల కుమారస్వామి ,పుట్ట మల్లేశం, బేతి రాములు , అయితే వెంకటేష్, కొరుటూరి ఇస్తారి, మొరిగాడి బాలరాజు, తునికి దశరథ,దూడల రవి, బింగి నరసింహులు, అంబికా ఇంద్రదాసు , సముద్రాల శ్రీధర్, బేతి లక్ష్మణ్,ఘనగాని రాము, లక్ష్మణ్, శివ పాల్గొన్నారు.