Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశానికి వెన్నెముకైన రైతన్న లా
దేహానికి వెన్నుదనైన వెనముకలా
వృక్షానికి మూలమైన వేరుల్లా
కుటుంబానికి నానమ్మ అలా!
కొడుకుకు అమ్మలా
కొడుకు భార్యకు అత్తయ్యలా
కొడుకు సంతతికి నానమ్మ యై
కూతురు సంతతికి
అమ్ముమ్మ యై
సకుటుంబ సమేతానికి ఆరాధ్యురాలై
మానవతా విలువలు పంచే
మాతృమూర్తియై
అమృతవాక్కులు అందించే అమృతవల్లియై
ఆపదల్లో పరిష్కారాలు చూపే
నాగమ్మయై
మహనీయుల గాధలు వల్లివేసే
ఉపాధ్యాయినియై
నైతికవిలువల విలువలు తెలిపే విరనారియై
ఉమ్మడి కుటుంబానికి దిక్షుచియై
సర్వకళల సమహారమై
విలసిల్లుతుంది నానమ్మ!
- ఆళ్ల నాగేశ్వరరావు
తెనాలి, 7416638823