Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇటీవలే జరిగిన మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గ కమిటీలో డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా నియమించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి వ్యవస్థాపక గౌరవ ముఖ్య సలహాదారుగా మూడున్నర దశాబ్దాల క్రితం స్థాపించబడిన మానేరు రచయితల సంఘంనకు నూతన కార్యవర్గాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంకు చెందిన పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ను మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిటికెన మాట్లాడుతూ ఈ మానేరు ప్రాంతం నుండి తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన జ్ఞానపీఠ పురస్కారంతో పాటు కేంద్ర, రాష్ట్ర సాహిత్య పురస్కారాలను అందుకున్న ఎందరో మంది సాహితీవేత్తల పురిటి గడ్డ అని, మారసం సంస్థ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారని అందుకు సంస్థ వ్యవస్థాపక వర్గానికి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ఒక ప్రకటనలో తెలియజేశారు.